చిగురుపాటి హత్య కేసు: టీఆర్ఎస్‌ నేత అరెస్ట్‌కు రంగం సిద్దం?

By narsimha lodeFirst Published May 2, 2019, 11:14 AM IST
Highlights

న్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో  ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

హైదరాబాద్: ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో  ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

జయరామ్ హత్యకు రెండు రోజుల ముందు బిఎన్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ఉదయం కూడ బిఎన్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

బిఎన్ రెడ్డిని  గతంలోనే బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో  విచారించారు. బీఎన్‌రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. చార్జీషీట్‌లో బిఎన్ రెడ్డి పేరును కూడ చేర్చిన నేపథ్యంలో  అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

click me!