వనమా రాఘవ ఇంటికి పోలీసుల నోటీసులు..

Published : Jan 07, 2022, 12:39 PM IST
వనమా రాఘవ ఇంటికి పోలీసుల నోటీసులు..

సారాంశం

\ తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి notices అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఎస్పీ శబరీష్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. 

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా palvanchaలో కుటుంబం suicide చేసుకున్న ఘటనలో నిందితుడు vanama raghavendra rao ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అతడిని ఇప్పటి వరకు పోలీసులు arrest చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తో కొత్తగూడెం బందును కొనసాగిస్తున్నారు.

తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా.. ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి notices అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఎస్పీ శబరీష్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. 

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదని  కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.

రాఘవ కోసం ఏడేనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. Vanama Raghava పై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆధారాలు లభిస్తే Rowdysheet నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

నాగ రామకృష్ణ కుటుంబం Suicide వ్యవహారంలో రాఘవేంద్రరావు హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసినట్లు Social mediaలో వైరల్ అయ్యింది. ఆత్మహత్యకు ముందు Ramakrishna తీసుకున్న Selfie video చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే 
Vanama Venkateswara Rao స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు  లేఖరాశారు. 

తన కుమారుడు పై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీసుల విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

 హైదరాబాద్ లో అరెస్టు చేసిన  రాఘవపై  పాల్వంచ పీఎస్లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరిగింది.  తాజాగా రాఘవను పోలీసులు అరెస్టు చేయలేదని అధికారిక ప్రకటన చేయడంతో గందరగోళం నెలకొంది. 

ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తీసిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే
మా దగ్గర కూడా కండలు తిరిగినోళ్లు ఉన్నారు: Revanth Reddy warns Kaushik Reddy & BRS | Asianet Telugu