చంద్రబాబుకు షాక్: కూకట్ పల్లి రోడ్ షో కు అనుమతి నిరాకరణ

By Nagaraju TFirst Published Nov 28, 2018, 9:37 PM IST
Highlights

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మాదాపూర్ పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో తన మేనకోడలు టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు నిర్వహించే రోడ్ షోకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోకు అనుమతి ఇచ్చామని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. ఒకే రోజు రెండు పార్టీల రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. 

హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మాదాపూర్ పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో తన మేనకోడలు టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు నిర్వహించే రోడ్ షోకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోకు అనుమతి ఇచ్చామని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. ఒకే రోజు రెండు పార్టీల రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. 

గతంలోనే కేటీఆర్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని తెలిపారు. అయితే శేరిలింగంపల్లి  నియోజకవర్గంలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇకపోతే తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఖమ్మం బహిరంగ సభతో శ్రీకారం చుట్టారు. అనంతరం సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. 

ఆ తర్వాత నాంపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మహ్మద్‌ఫిరోజ్‌ ఖాన్‌ ను గెలిపించాలని కోరారు. అయితే గురువారం మాత్రం కూకట్‌పల్లిలో మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్‌షోకు అనుమతి నిరాకరించారు. దీంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో మరో రోజుకు వాయిదా పడింది. 

ఇకపోతే పోలీసుల నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెండు రోజుల ముందే దరఖాస్తు చేసినప్పటికీ కావాలనే అనుమతివ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో చంద్రబాబు రోడ్‌షోను నిర్వహిస్తారని చెప్పినా పోలీసులు అనుమతించడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. దీనిపై  ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.  

 

click me!