గద్దర్ పాటకు చంద్రబాబు ఫిదా: వేదికపై ఆలింగనం

By pratap reddyFirst Published Nov 28, 2018, 9:14 PM IST
Highlights

గద్దర్‌కు రాహుల్, చంద్రబాబు అంబేద్కర్ చిత్ర పటాలను బహుమతిగా అందజేశారు. "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాయమా.. కోట్లాది ప్రాణమా.. భూ తల్లి బిడ్డలు, చిగురించే రెమ్మలు" అంటూ తన గొంతును వినిపించారు. గద్దర్ పాటను వింటూ చంద్రబాబు ముసిముసి నవ్వులు కురిపించారు. 

ఖమ్మం: ప్రజా గాయకుడు గద్దర్ పాటకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫిదా అయ్యారు. ఖమ్మంలో ప్రజా కూటమి నిర్వహించిన సభలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు వేదికను పంచుకోవడం ఓ విశేషసమైతే. వారితో గద్దర్ వేదికను పంచుకోవడం మరో విశేషం. దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారత దేశాన్ని కలపడానికి ఆ ఇద్దరు నాయకులు కృషి చేయాలని గద్దర్ కోరారు.

గద్దర్‌కు రాహుల్, చంద్రబాబు అంబేద్కర్ చిత్ర పటాలను బహుమతిగా అందజేశారు. "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాయమా.. కోట్లాది ప్రాణమా.. భూ తల్లి బిడ్డలు, చిగురించే రెమ్మలు" అంటూ తన గొంతును వినిపించారు. గద్దర్ పాటను వింటూ చంద్రబాబు ముసిముసి నవ్వులు కురిపించారు. 

‘సేవ్ ఇండియా సేవ్ కానిస్టిట్యూషన్’ అంటూ బయలుదేరారని గద్దర్ రాహుల్, చంద్రబాబులనుద్దేశించి అన్నారు. వారిద్దరికీ వందనాలు అని గద్దర్ చెప్పగా ప్రతిగా వీరిద్దరూ చేతులు జోడించి గద్దర్‌కు సమస్కారం చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఇద్దరు మహానుభావులు ముందుకొచ్చారని గద్దర్ వారిద్దరిని ప్రశంసించారు. 

ఖమ్మం సభ చారిత్రాత్మక సభ అని గద్దర్ అన్నారు. ప్రసంగాన్ని ముగించి వెళుతున్న గద్దర్‌ను రాహుల్ అభినందించారు. చంద్రబాబు గద్దర్ ను ఆలింగనం చేసుకున్నారు.

click me!