పద్మాలయ స్టూడియో వద్ద అభిమానులు ఒక్కసారిగా రావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు.వీఐపీల రాకతో అభిమానులను స్టూడియోలోకి అనుమతించలేదు. తమను అనుమతించాలని పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు.తోపులాట జరిగింది.దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.
హైదరాబాద్: హీరో కృఫ్ణను కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియో వద్దకు అభిమానులు పోటెత్తారు. కృష్ణ పార్ధీవదేహనికి నివాళులర్పించేందుకు వీఐపీలు,వీవీపీలు రావడంతో బుధవారంనాడు అరగంటపాటు అభిమానులను నిలిపివేశారు.దీంతో ఒక్కసారిగా స్టూడియో లోపలికి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు.ఫలితంగా తోపులాట చోటు చేసుకుంది.బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని నిలువరించారు. పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు.పోలీసులకు ,అభిమానులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలీసులు స్వల్ప లాఠీచార్జీచేశారు.
వీఐపీలు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించారు. బాలకృష్ణ, ఏపీసీఎం వైఎస్ జగన్,తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మంత్రి రోజాతదితరలు ఒకే సంయంలో రావడంతో అరంగంటకుపైగా అభిమానులను స్టూడియో లోపలికి వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు.
మంగళవారంనాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించాడు.కృష్ణ పార్థీవ దేహన్నినిన్న ఉదయమే నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరించారు. ఇవాళ ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ పార్థీవదేహన్నితరలించారు. అభిమానుల సందర్శనార్ధం స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచుతారు.
alsoread:హీరో కృష్ణకు గవర్నర్ తమిళిసై నివాళులు: కుటుంబ సభ్యులకు ఓదార్పు
నిన్న పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీదేహనికి నివాళులర్పించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ,ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. గుండెపోటు రావడంతో కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ నిన్నతెల్లవారుజామున మృతి చెందాడు.
హీరో మహేష్ బాబు కటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన కొద్ది రోజులకే తల్లి ఇందిరాదేవి మరణించింది.తల్లి మరణించిన రెండునెలల్లోపుగానే హీరో కృష్ణ మృతి చెందాడు.రమేష్ బాబు మరణానికి రెండేళ్ల ముందే హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.