హీరో కృష్ణ పార్థీవదేహనికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు.హీరో మహేష్ బాబుసహా కటుంబసభ్యులను గవర్నర్ ఓదార్చారు.
హైదరాబాద్:టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహనికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడునివాళులర్పించారు. హీరో మహేష్ బాబు కుటుంబసభ్యులను ఓదార్చారు.ఇవాళ మధ్యాహ్నం పద్మాలయా స్టూడియోలో హీరో కృష్ణ పార్ధీవదేహనికి గవర్నర్ నివాళులర్పించారు.హీరో మహేష్ బాబును ఆమె ఓదార్చారు.మహేష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.కృష్ణ కూతురు మంజుల కుటుంబసభ్యులను పరిచయం చేశారు.కృష్ణ ధైర్యంగా ఉండాలని ఆమె కుటుంబసభ్యులను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.సినీ పరిశ్రమకు కృష్ణ ఎంతో సేవచేశారని ఆమె కొనియాడారు.కృష్ణ మృతితో ఎంతో మంది బాధపడుతన్నారంటే ఆయన ఎంత గొప్ప నటుడో అర్ధం చేసుకోవచ్చన్నారు.కృష్ణ కుటుంబసభ్యులకు ఆమె సానుభూతి తెలిపారు. కృష్ణ మృతి కళారంగానికి తీరనిలోటన్నారు.
మంగళవారంనాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించాడు.కృష్ణ పార్థీవ దేహన్నినిన్న ఉదయమే నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరించారు. ఇవాళ ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ పార్థీవదేహన్నితరలించారు. అభిమానుల సందర్శనార్ధం స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచుతారు.
నిన్న పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీదేహనికి నివాళులర్పించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ,ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. గుండెపోటు రావడంతో కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ నిన్నతెల్లవారుజామున మృతి చెందాడు.
also read:కృష్ణకు నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్:కుటుంబ సభ్యులకు ఓదార్పు
హీరో మహేష్ బాబు కటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన కొద్ది రోజులకే తల్లి ఇందిరాదేవి మరణించింది.తల్లి మరణించిన రెండునెలల్లోపుగానే హీరో కృష్ణ మృతి చెందాడు.రమేష్ బాబు మరణానికి రెండేళ్ల ముందే హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.