పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: పోలీసుల అదుపులో ఇద్దరు, మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

Published : Jan 11, 2022, 01:27 PM ISTUpdated : Jan 11, 2022, 01:36 PM IST
పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: పోలీసుల అదుపులో ఇద్దరు, మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

సారాంశం

నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబం ఆత్మహత్య కేసులో  వినీత, చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిజామాబాద్ కు చెందిన గణేష్ తో పాటు మరొకరి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.

నిజామాబాద్: Vijayawadaలో ఆత్మహత్య చేసుకొన్న Nizambad జిల్లాకు చెందిన పప్పుల suresh  కుటుంబం suicide కేసులో  నిర్మల్ జిల్లాకు చెందిన  ఇద్దరిని పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు.నిజామాబాద్ కు చెందిన గణేష్ తో పాటు మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈ నెల 6వ తేదీన విజయవాడకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబం అక్కడే ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు సురేష్ సెల్ఫీ వీడియోను తీసుకొన్నాడు. సురేష్ ఆయన భార్య ఇద్దరు కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకొన్నారు. సురేష్ కొడుకు కూడా ఆడియో సందేశాన్ని తన బంధువులకు పంపాడు. సురేష్ Selfie Video తో పాటు సూసైడ్ లేఖను కూడా రాశాడు. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Nirmal  జిల్లాకు చెందిన Vineeta chandrashekar తో పాటు నిజామాబాద్ కు చెందిన గణేష్ తో పాటు మరొకరి పేరును సెల్ఫీ వీడియోలో సురేష్ ప్రస్తావించారని సమాచారం. ఈ  వీడియో ఆధారంగా  వినీత, చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గణేష్ తో పాటు మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది.

సురేష్ కు ఈ నలుగురు ఎంత మేరకు అప్పులు ఇచ్చారు. సురేష్ వారికి ఎంత మేరకు అప్పులు తీర్చాడు, ఏ మేరకు వడ్డీ కింద చెల్లించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వడ్డీ వ్యాపారులు వడ్డీల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేయడంతో పాటు వేధింపులకు పాల్పడిన కారణంగానే ఆత్మహత్య చేసకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సురేష్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. తన ఇంటితో పాటు ప్లాట్ ను కూడా వేలం వేయాలని కూడా వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో  ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని సురేష్ తెలిపారు.

నిజామాబాద్ కు చెందిన వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రంగా ఉంటాయని బాధితులు చెబుతున్నారు. మహిళలను ఇంటికి పంపి వేధింపులకు గురి చేయడంతో పాటు ఆస్తుల స్వాధీనం కోసం  సంతకాలు చేయించుకోవడం వంటి చర్యలకు కూడా పాల్పడుతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పప్పుల సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకొంటామని నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు.  వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేస్తే తమను ఆశ్రయించాలని సీపీ సూచించారు. వడ్డీ వ్యాపారులు  వేధిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.  సురేష్ కుటుంబం తమను ఆశ్రయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు చెబుతున్నారు.

నిజామాబాద్ లో వడ్డీ వ్యాపారులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. దీంతో  వారంతా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో పోలీస్ శాఖలో చలనం వచ్చింది. అయితే ఇంత కాలం పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలను పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరించారనే విమర్శలు కూడా లేకపోలేదు.అయితే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు ముందు బంధువులకు పంపిన సెల్ఫీ వీడియో తో పాటు ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా