వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో.. 42మంది విద్యార్థులకు కరోనా..!

By SumaBala Bukka  |  First Published Jan 11, 2022, 11:27 AM IST

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో నిన్న ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 


వరంగల్ : జిల్లాలోని Kakatiya Medical Collegeని కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు Corona positive కేసులు 42కు చేరాయి. నిన్న ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 

కాగా, ఆదివారం నాడు Warangal కాకతీయ వైద్య కళాశాలలో మళ్లీ కరోనా పడగవిప్పింది. ఇక్కడ చదువుకుంటున్న మరో ఐదుగురు మెడికోలకు ఆర్ టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ణారణ అయ్యింది. ఇప్పటివరకు 25 మంది మెడికోలకు కరోనా సోకింది. దీంతో తోటి మెడికోలు, ప్రొఫెసర్లు భయాందోళన చెందుతున్నారు. శనివారం 195 మంది మెడికోలకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. 

Latest Videos

వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్ అప్రమత్తం అయ్యారు. పాజిటివ్ గా నిర్థారణ అయిన మేడికోలను ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. కాగా మంగళవారం ఈ సంఖ్య 42కు చేరుకోవడం కలకలం రేపింది. 

కాగా, గత శుక్రవారం జనవరి 7న warangal NIT క్యాంపస్ లోకి కరోనా కలకలం సృష్టించింది. ఓవైపు omicron భయం వెంటాడుతున్న వేళ భారత్ లో కరోనా  కలకలం కూడా మొదలయ్యింది. గతకొంత కాలంగా చాలా తక్కువగా నమోదయిన కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 

తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా వరంగల్ ఎన్ఐటీ  క్యాంపస్ లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఇప్పటివరకు 16మంది ఎన్ఐటీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్ఐటీ విద్యార్థులు కొందరు ఇళ్లకు వెళ్లివచ్చారు. అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్యాంపస్ అధికారులు అనుమానంతో టెస్టులు చేయించగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో క్యాంపస్ లోని మిగతా స్టూడెంట్స్ కు కూడా కరోనా టెస్టులు చేయగా మొత్తం 16మందికి పాజిటివ్ గా తేలింది. 

ఇలా క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 16వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా నిర్దారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని... అందరు విద్యార్థులు ఆరోగ్యంగానే వున్నారని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, త‌మిళ‌నాడులో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో సోమవారం క‌రోనా క‌ల‌క‌లం రేపింది. సీఎంసీలోని 200 మందికి పైగా వైద్య సిబ్బందికి  క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 

సీఎంసీ ఆస్ప‌త్రి వైద్య సిబ్బందికి క‌రోనా సోకిన విష‌యం గురించి వేలూరు కార్పొరేషన్ సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ టి మణివన్నన్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి కరోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని అన్నారు. అయితే, హ‌స్పిట‌ల్ యాజ‌మాన్యం క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్న‌ద‌ని వెల్ల‌డించారు. 

click me!