
నల్గొండ జిల్లా : కలకలం రేపి Chintapalli Zoneలో మొండెం లేని head కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం హతుడి వివరాలు కనుగొన్నారు. సోమవారం ఉదయం చింతపల్లి మండల పరిధిలో brutal murderకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు కనుగొన్నారు.
గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల mettu Mahankali అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపడంతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను కనుగొన్నారు.
హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) దిగా తండ్రి శంకర్ నాయక్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలిపారు.
ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని ఎవరు హత్య చేసివుంటారు? తల ఆలయంలో పెట్టిన హాంతకులు శరీర భాగాన్ని ఎక్కడ వదిలి వెళ్లారు? అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మూఢనమ్మకాలతో ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా, సోమవారం నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో దారుణ హత్య జరిగింది. మైసమ్మ గుడి వద్ద మొండెం లేని మనిషి తల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. హైదరాబాద్-నాగార్జున రాష్ట్ర రహదారిని అనుకుని చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో తల భాగాన్ని వదిలివెళ్లారు.
మైసమ్మ గుడి ముందు ఉన్న పోతురాజు విగ్రహం వద్ద తలను ఉంచారు. సోమవారం ఉదయం దీనిని గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతర శరీరభాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అర్దరాత్రి వేళ నరబలి జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆ వ్యక్తిని ఆలయం వద్దే హత్య చేశారా..? లేక ఎక్కడైనా హత్య చేసిన తలను ఇక్కడకు తీసుకొచ్చి వదిలివెళ్లారా..? అనేది తేలాల్సి ఉంది. ఇక, ఇది హత్య..? లేక నరబలా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.