యూట్యూబ్ వీడియోలు చూసి శరీర భాగాల తొలగింపు: ఇంకా దొరకని నవీన్ మొబైల్

By narsimha lode  |  First Published Mar 5, 2023, 11:33 AM IST

బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య  కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు  చేస్తున్నారు.  హత్యకు గురైన నవీన్  మొబైల్ కోసం  పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.



హైదరాబాద్:  హరిహరకృష్ణ  చేతిలో  హత్యకు గురైన  నవీన్  మొబైల్  ఫోన్  ఎక్కడుందో  అనే విషయాన్ని  పోలీసులు  ఇంకా గుర్తించలేదు. నవీన్  మొబైల్ ఫోన్ లభ్యమైతే ఈ కేసులో  మరిన్ని చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు  భావిస్తున్నారు.

2023 ఫిబ్రవరి  17వ తేదీన  అబ్దుల్లాపూర్ మెట్  సమీపంలో  నవీన్ ను  అత్యంత  దారుణంగా  హరిహరకృష్ణ హత్య  చేశాడు.ఈ ఘటన  రాష్ట్ర వ్యాప్తంగా  కలకలం సృష్టించింది. గత నెల  24వ తేదీన హరిహరకృష్ణ  పోలీసులకు  లోంగిపోయాడు.  లవర్  విషయమై  నవీన్ ను  హరిహరకృష్ణ హత్య చేశాడు. ఇంటర్మీడియట్ లో  నవీన్,  హరిహరకృష్ణలు  స్నేహితులు. అదే సమయంలో  ఇదే కాలేజీలో  చదివిన  విద్యార్ధినితో  వీరిద్దరికి  పరిచయం  ఏర్పడింది. నవీన్ ను అడ్డు తొలగించుకుంటే  ఆ యువతి  తనకే దక్కుతుందని భావించిన హరిహరకృష్ణ నవీన్ ను దారుణంగా హత్య  చేశాడు.

Latest Videos

నవీన్ ను హత్య  చేసిన తర్వాత  శరీరబాగాలను కోసి బ్యాగులో  వేసుకొని  బ్రహ్మణపల్లి సమీపంలోని  నిర్మానుష్య ప్రాంతంలో  వేశాడు.   హరిహరకృష్ణను పోలీసులు  ఈ నెల  3వ తేదీన  కస్టడీలోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు  హరిహరకృష్ణను  పోలీసులు  ప్రశ్నించనున్నారు.  శనివారం నాడు  నవీన్ హత్య కేసులో  పోలీసులు హరిహరకృష్ణతో  సీన్ రీ కన్ స్ట్రక్షన్  చేయించారు.   హత్య చేసిన తర్వాత  హరిహరకృష్ణ  ఎక్కడికి వెళ్లాడనే విషయాలపై  పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ విషయమై  ఆధారాలను  సేకరిస్తున్నారు. 

యూట్యూబ్ వీడియోలతో శరీర భాగాల తొలగింపు

గత నెల  17వ తేదీన  అంబర్ పేటలో  మద్యం కొనుగోలు  చేశారు నవీన్, హరిహరకృష్ణ. అబ్దుల్లాపూర్ మెట్  ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో  మద్యం తాగారు.   ఈ సమయంలో  లవర్ విషయమై  నవీన్, హరిహరకృష్ణ మధ్య  వాగ్వాదం  చోటు  చేసుకుంది.  నవీన్  గొంతు  నులిమి  హరిహరకృష్ణ    హత్య  చేశాడు. అనంతరం  నవీన్  శరీరబాగాలను వేరు చేశారు. చేతి వేళ్లు,  గుండె,  ఇతర బాగాలను  కోసి  బ్యాగులో  వేసుకున్నాడు.  యూట్యూబ్ లో  పోస్టుమార్టం వీడియోలను  చూసి  నవీన్  శరీరబాగాలను  తీసినట్టుగా  పోలీసులు  దర్యాప్తులో  గుర్తించారు.క్రైమ్ సినిమాలు , వెబ్ సీరీస్ లను చూసి నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్  చేసినట్టుగా  పోలీసులు  అనుమానిస్తున్నారు. 

శనివారంనాడు  హరిహరకృష్ణ అక్క, బావల  స్టేట్ మెంట్ లను   పోలీసులు రికార్డు  చేశారు.  నవీన్ ను హత్య  చేసిన తర్వాత  బ్రహ్మణపల్లిలోని  తన స్నేహితుడు హసన్ ఇంటికి  నిందితుడు  హరిహరకృష్ణ వెళ్లాడు.  హసన్ నుండి కూడా పోలీసులు స్టేట్ మెంట్  ను తీసుకున్నారు. నవీన్ హత్య  విషయాన్ని  హసన్ కు  హరిహరకృష్ణ చెప్పాడు. హసన్ వద్ద ఒక జత బట్టలు తీసుకొని స్నానం  చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు  హరిహరకృష్ణ.  

also read:నవీన్ హత్య కేసు.. హరిహరకృష్ణను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్.. కొనసాగుతున్న పోలీసుల విచారణ..

హత్యకు గురైన నవీన్ మొబైల్  ఫోన్  ఇంకా  లభ్యం కాలేదు.  ఈ మొబైల్ ఫోన్ ను హరిహరకృస్ణ  ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొబైల్  కోసం  పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు హరిహరకృష్ణ  చాటింగ్  ను  పోలీసులు రిట్రీవ్  చేయనున్నారు.  ఇప్పటికే  మొబైల్ లో డేటాను  హరిహరకృష్ణ  డిలీట్  చేశాడు.  నవీన్ హత్యకు  ముందు  ఆ తర్వాత  నిందితుడు ఎవరెవరితో  చాట్  చేశాడనే విషయాన్ని  పోలీసులు గుర్తించే ప్రయత్నం  చేస్తున్నారు.

click me!