రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

By narsimha lodeFirst Published May 9, 2019, 3:09 PM IST
Highlights

 టీవీ9 సీఈఓ రవి ప్రకాష్‌పై సైబరాబాద్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు.ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

హైదరాబాద్: టీవీ9 సీఈఓ రవి ప్రకాష్‌పై సైబరాబాద్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు.ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కౌశిక్ రావు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం నాడు రవిప్రకాష్ ఇంట్లో, కార్యాలయంలో  సోదాలు నిర్వహించారు.ఈ సోదాలు జరిగిన సమయంలో  రవిప్రకాష్ మాత్రం  లేడు. రవిప్రకాష్ ఇంట్లో లేడు.  రవిప్రకాష్ పాస్‌పోర్ట్‌ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రెండు రోజులుగా రవిప్రకాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలుస్తోంది.

కంపెనీ ఆర్థిక లావాదేవీలపై  కొత్త యాజమాన్యం అంతర్గత విచారణ జరిపినట్టు తెలిసింది. భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్ కోట్లు దారి మళ్లించినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.టీవీ9 వాటాల కొనుగోలు విషయంలో ఈ వివాదం చోటు చేసుకొన్న విషయం  తెలిసిందే.

సంబంధిత వార్తలు

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

click me!