పోలీసులపై దాష్టీకం.. అరెస్ట్ చేయడానికొస్తే కుక్కలను వదిలిన పీవీపీ

Siva Kodati |  
Published : Jun 29, 2020, 04:58 PM ISTUpdated : Jul 01, 2020, 10:25 AM IST
పోలీసులపై దాష్టీకం.. అరెస్ట్ చేయడానికొస్తే కుక్కలను వదిలిన పీవీపీ

సారాంశం

వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పోలీసుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు

వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పోలీసుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ పీవీపీపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో వరప్రసాద్ వారిపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు.

ఈ హఠాత్పరినామంతో ఖంగుతిన్న పోలీసులు భయాందోళనకు గురై బయటకు వచ్చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై హరీశ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో, ఐపీసీ సెక్షన్ 353 కింద పీవీపీపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే