పెళ్లికావాలంటే... దెయ్యం వదలాలి..నయా మోసం తెరపైకి

By telugu teamFirst Published Jan 22, 2020, 11:20 AM IST
Highlights

నగరానికి చెందిన ఓ యువతికి కొన్ని సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన కు చెందిన సదరు యువతి.. తన బాధను తన సన్నిహితులకు చెప్పి వాపోయింది. వాళ్లు ఆమెకు ఓ ఉచిత సలహా ఇచ్చారు. నీకు ఎవరైనా చేతబడి చేశారేమో అందుకే పెళ్లి కావడం లేదేమో అని ఆమెలో ఓ సందేహాన్ని లేపారు.
 


ఇప్పటి వరకు ఎన్నో రకాల సైబర్ నేరాలు చూసి ఉంటారు. కానీ ఇదో కొత్త రకం మోసం. చాలా మంది అమ్మాయిలు... మ్యాట్రీమోనీలో విదేశీ కుర్రాలను చూసి పెళ్లికి ఒకే చెప్పడం... వాళ్లు అక్కడి నుంచి నగలు, డైమండ్స్ పంపామని చెప్పడం.. అవి కావాలంటే కస్టమ్స్ వాళ్లకి డబ్బులు కట్టాలని చెప్పడం... ఇదంతా ఒకరకమైన మోసం. ఇంకొందరు.. మా అమ్మకి ఒంట్లో బాగోలేదని.. మరికొందరు.. బిజినెస్ కోసం డబ్బు అవసరం మంటూ... ఇలా పలు కారణాలతో లక్షలకు లక్షలకు గుంజేశారు. తీరా డబ్బంతా ఇచ్చాక మోసపోయినట్లు గుర్తించిన అమ్మాయిలు పోలసులకు ఫిర్యాదు చేస్తారు.

కానీ... ఈ కేసు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఆమెకు పెళ్లి కాకపోవడానికి... దెయ్యానికి లింకు పెడుతూ ఓ వ్యక్తి నగర యువతి వద్ద నుంచి రూ.5లక్షలు కాజేశాడు. చాలా ఆలస్యంగా మోసపోయినట్లు గుర్తించిన బాధిత యువతి తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ఓ యువతికి కొన్ని సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన కు చెందిన సదరు యువతి.. తన బాధను తన సన్నిహితులకు చెప్పి వాపోయింది. వాళ్లు ఆమెకు ఓ ఉచిత సలహా ఇచ్చారు. నీకు ఎవరైనా చేతబడి చేశారేమో అందుకే పెళ్లి కావడం లేదేమో అని ఆమెలో ఓ సందేహాన్ని లేపారు.

అది విన్న సదరు యువతి నిజమేనేమో అని అనిపించింది. వెంటనే ఇలాంటి వాటికి పరిష్కారం ఎవరు చెబుతారా అని గూగుల్ లో వెతికింది. దక్షిణ భారత్ కి చెందిన ఓ వ్యక్తి వివరాలు ఆమెకు దొరికాయి. వెంటనే అతనికి ఫోన్ చేస్తే... ఆమె పూర్తి వివరాలు కనుక్కున్నాడు. చేతబడి ఏమీ జరగలేదని మీ కుటుంబంలో ఒకరికి దెయ్యం పట్టిందని.. అందుకే పెళ్లి కుదరడం లేదని ఆమెను నమ్మించాడు.

Also Read ఓరేయ్ అని పిలిచాడని...బీరు సీసాతో గొంతులో పొడిచి.....

అప్పటికే ఎన్నో సంబంధాలు చూసి ఏదీ కుదరకపోవడంతో అతను చెప్పింది నిజమేనని ఆమె భావించింది. పరిష్కారం చెప్పమని ప్రాధేయపడింది.కొన్ని రకాల పూజలు చేస్తే సరిపోతుందని అతను చెప్పడంతో.. అందుకు ఆమె అంగీకరించింది. పలు ధఫాలుగా అతనికి దెయ్యం వదిలించేందుకు రూ.5లక్షలు చెల్లించింది. అతను ఇంకా కొన్ని పూజలు చెయ్యాలని మళ్లీ కొంత డబ్బులు చెల్లించమని అడిగాడు.

ఇన్ని రోజులు గడుస్తున్నా పెళ్లి విషయంలో పురోగతి కనిపించకపోవడంతో ఆమెకు తాను మోసపోయాననే విషయం అర్థమయ్యింది. దీంతో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!