తెలంగాణలో కరోనాతో కానిస్టేబుల్ మృతి: పోలీస్ శాఖలో కోవిడ్‌తో తొలి మరణం

Published : May 21, 2020, 02:10 PM IST
తెలంగాణలో కరోనాతో కానిస్టేబుల్ మృతి: పోలీస్ శాఖలో కోవిడ్‌తో తొలి మరణం

సారాంశం

కరోనాతో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారిలో పోలీసుశాఖలో ఇదే మొదటి కేసు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.


హైదరాబాద్: కరోనాతో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారిలో పోలీసుశాఖలో ఇదే మొదటి కేసు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దయాకర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పాతబస్తీలో ఆయన విధులు నిర్వహించాడు.

ఆదివారం నాడు ఆయనకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడంతో ఆయనను బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపితే కరోనా సోకినట్టుగా తేలింది. కరోనా సోకినట్టుగా సోమవారం నాడు  అధికారులు గుర్తించి చికిత్సను ప్రారంభించారు.

బుధవారం నాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసు శాఖ ధృవీకరించింది. దయాకర్ రెడ్డితో కలిసి పనిచేసిన 16 మంది పోలీసుల శాంపిల్స్ సేకరించారు. మరో నలుగురిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

దయాకర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ డీజీపీ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకొంటామని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం