గాంధీ ఆసుపత్రిలో కరోనాతో మరణించిన మధుసూధన్ అంత్యక్రియలను తామే నిర్వహించినట్టుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలో కరోనాతో మరణించిన మధుసూధన్ అంత్యక్రియలను తామే నిర్వహించినట్టుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
వనస్థలిపురానికి చెందిన మాధవి అనే మహిళ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ, గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ ఇప్పటికే స్పందించారు. గురువారం నాడు మంత్రి ఈటల రాజేందర్ కూడ ఈ విషయమై స్పందించారు.
undefined
కరోనాతో ఈశ్వరయ్య అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొదట్లో కరోనాతో చనిపోయిన వారిని దహనం చేసేందుకు భయపడ్డారన్నారు. ఈశ్వరయ్య ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లో మృతి చెందాడన్నారు.
కరోనాతో ఈశ్వరయ్య కొడుకు మధుసూధన్ కూడ ఆసుపత్రిలో చేరి మే 1వ తేదీన మరణించాడు. మధుసూధన్ కుటుంబం మొత్తం ఆ సమయంలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టుగా మంత్రి గుర్తు చేశారు.
also read:కరోనా మృతుడి అంత్యక్రియల వివాదం: గాంధీ సూపరింటిండెంట్ స్పందన ఇదీ...
మధుసూధన్ మృతి గురించి పోలీసులకు కూడ సమాచారం ఇచ్చామన్నారు మంత్రి. అయితే ఆయన మరణించిన విషయం తెలిస్తే కుటుంబసభ్యులు తట్టుకోలేరని సన్నిహితులు తమకు చెప్పారన్నారు. అందుకే మధుసూదన్ అంత్యక్రియలను తామే నిర్వహించినట్టుగా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.మధుసూదన్ డెడ్ బాడీని ప్రీజర్ లో పెట్టే పరిస్థితి కూడ లేదన్నారు మంత్రి
ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యకు మధుసూధన్ చనిపోయిన విషయం తెలిస్తే షాక్ కు గురయ్యే ప్రమాదం ఉందని భావించి ఆమెకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇలా మాట్లాడడం సరైంది కాదన్నారు.