పంద్రాగస్టున ఉత్తమ అధికారి అవార్డు.. తర్వాతిరోజే లంచం తీసుకుంటూ..

By telugu teamFirst Published Aug 17, 2019, 9:02 AM IST
Highlights

ఆయన అందించిన ఉత్తమ సేవలకు ఉన్నతాధికారులు ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించారు. అయితే... ఆ పత్రాన్ని అందుకున్న మరుసటి రోజే ఆయన బుద్ధి గడ్డి తిన్నది.

ఉత్తమ అధికారి అవార్డు అందుకొని ఒక్కరోజు కూడా గడవలేదు. అప్పుడే లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తిరుపతి రెడ్డి... పంద్రాగస్టు రోజున ఉత్తమ అధికారి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఆయన అందించిన ఉత్తమ సేవలకు ఉన్నతాధికారులు ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించారు. అయితే... ఆ పత్రాన్ని అందుకున్న మరుసటి రోజే ఆయన బుద్ధి గడ్డి తిన్నది. ఓ ఇసుకు వ్యాపారి వద్ద నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
రెండు సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లుగా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. తిరుపతి రెడ్డి వద్ద డబ్బును స్వాధీనం చేసుకొని అతనిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. 

click me!