ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి... యజమాని కూతురిపైనే..

Published : Aug 17, 2019, 08:11 AM IST
ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి... యజమాని కూతురిపైనే..

సారాంశం

తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లింది. అది గమనించిన వీరస్వామి వారి ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. 

ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి.. ఇంటి యజమాని కూతురిపైనే కన్నేశాడు. కనీసం ఆ యువతికి మతిస్థిమితం కూడా లేదన్న విషయాన్ని మరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం  అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... పోలీసులు అతనిని పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) మూడు నెలల క్రితం రహమత్‌నగర్‌ ప్రాంతంలో అద్దె గదిలో నివసిస్తున్నాడు. అతని వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ భార్యతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఇక్కడ ఒక్కడే నివసిస్తూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

అతను నివసించే ఇంటి యజమానురాలికి మతిస్థిమితం లేని కుమార్తె(30) ఉంది. గురువారం తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లింది. అది గమనించిన వీరస్వామి వారి ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అప్పటికే అది గమనించిన వీరస్వామి అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?