జమిలీ ఎన్నికలతో.. దేశం రెండుగా చీలిపోతుంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Published : Feb 01, 2021, 03:39 PM IST
జమిలీ ఎన్నికలతో.. దేశం రెండుగా చీలిపోతుంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమంటూ మల్కాజ్ గిరీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడిపోయాక దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు. 

జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమంటూ మల్కాజ్ గిరీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడిపోయాక దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు. 

సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ విధంగా కామెంట్ చేశారు. అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం లేదని, అధ్యక్షుడిగా నేరుగా ఎన్నికలు జరిగితే దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనికదేశం అవుతుందన్నారు. 

దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకూరుకుంటారని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అవ్వడంతోనే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. 

అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలే ట్యాక్స్ అత్యధికంగా కడుతున్నాయని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెలుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలి డిమాండ్ చేశారు. లేదంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడతాననన్నారు. 

రైతు ఉద్యమాన్ని అణిచి వేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీపై ఎవరి ఒత్తి ఉందో చెప్పాలన్నారు. 

ఇక బడ్జెట్ గురించి మాట్లాడుతూ అబద్దాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒరికిని మించిన వారు మరొకరన్నారు. కేంద్ర బడ్జెట్ లో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదని మండిపడ్డారు. గతంలో బీహీర్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు.. అది ఏమైందని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ, కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu