హైద్రాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో కేబుల్ చోరీ: నలుగురు అరెస్ట్

By narsimha lode  |  First Published Jun 15, 2022, 5:10 PM IST

హైద్రాబాద్ నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రూ. 38 లక్షల విలువైన కేబుల్స్ చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 


హైదరాబాద్: Hyderabad నగరంలోని Police Command Control కార్యాలయంలో కేబుల్స్ చోరీ చేసిన  నలుగురు నిందితులను బుధవారంనాడు హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.రూ. 38 లక్షల విలువైన కాపర్ కేబుల్స్ ను నిందితులు చోరీ చేశారు. దొంగిలించిన Copper Cables ను Krishnanagar లో విక్రయించేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని మీడియా రిపోర్ట్ చేసింది. తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ మరో ముగ్గురితో కలిసి ఈ కేబుల్స్ ను చోరీ చేశారని పోలీసులు తెలిపారు. 

చోరీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ విషయమై కేైసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను ఇవాళ అరెస్ట్ చేశారు.

Latest Videos

undefined

పోలీస్ కమాండ్ సెంటర్ భవనం ఒక లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. 

ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఈ భవనం నిర్మాణం రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత మరో రూ. 200 కోట్లు కేటాయించారు. 

 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ కమాండ్, కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. ఇక టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉంటాయి.
 

click me!