బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో బుధవారం నాడు అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తక్షణంగా రూ. 12 లక్షలు విడుదల చేస్తామని అధికారులు కూడా ప్రకటించారు. విద్యార్ధుల మాత్రం పట్టు వీడడం లేదు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్: ఆందోళన చేస్తున్న Basara Triple IT విద్యార్ధులతో బుధవారం నాడు అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. Students సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి KTR కూడా ప్రకటించారు. ఈ విసయమై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో ఇవాళ సాయంత్రం సమావేశం నిర్వహించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం తక్షణం రూ. 12 లక్షలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు
తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుండి విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లతో విద్యార్ధులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా బాసరకు చేరుకున్నారు.
undefined
అయితే విద్యార్ధులతో వారి తల్లిదండ్రులను మాట్లాడించేందుకు అనుమతించడం లేదని అధికారుల తీరుపై పేరేంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడకుండా విద్యార్ధులను కట్టడి చేశారు.బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పలు విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు బాసరకు వచ్చిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెగ్యులర్ వీసీ లేకపోవడంతో పాటు వసతులు కూడా సరిగా లేవని విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పాలన గాడి తప్పిందని కూడా వారు ఆరోపిస్తున్నారు . ఈ సంస్థలో సరిపడు స్టాఫ్ కూడా లేరని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్, ఏఎస్పీ, ఆర్డీఓలు విద్యార్ధులతో చర్చలు జరిపారు.