హైదరాబాద్: ఫిబ్రవరి 15న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం...?

Siva Kodati |  
Published : Jan 29, 2022, 04:43 PM IST
హైదరాబాద్: ఫిబ్రవరి 15న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం...?

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ (command control center) ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ (command control center) ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (hyderabad police commissioner) సీవీ ఆనంద్ (cv anand) ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.

వచ్చిన వాటిలో అత్యుత్తమైన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) ఎంపిక చేస్తారని, ఆ పేరు సూచించిన వారిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం రోజున సత్కరిస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన కొందరు నెటిజన్లు ‘క్వాడ్‌ కాప్‌’, ‘పోలీస్‌ టవర్స్‌ 4.0’, ‘టీ టవర్స్‌’, ‘విజిల్స్‌ అర్బన్‌’ ‘తెలంగాణ పోలీస్‌ మినార్‌’, ‘రక్షక్‌ స్క్వేర్‌’ ‘ఫాల్కన్‌ టవర్స్‌’, ‘డెక్కన్‌ ఎస్‌ స్క్వాడ్‌’ ‘సురక్షా భవన్‌’ వంటి పేర్లు సూచించారు. తమ అభ్యర్థనను మన్నించి అద్భుతమైన పేర్లను సూచిస్తున్నందుకు నెటిజన్లకు ధన్యవాదాలు చెబుతూ సీవీ ఆనంద్ మరో ట్వీట్ చేశారు.

కాగా.. కొద్దిరోజుల క్రితం కమాండ్ కంట్రోల్ నిర్మాణ పనులను సీవీ ఆనంద్ పరిశీలించారు. భవనంలోని భద్రతా ప్రాంతాల నుంచి మొదలై అన్ని అంతస్తులు, రెండు అంతస్తుల్లో పార్కింగ్, సమావేశ మందిరాలు, ఆడిటోరియంలు, సీపీ హైదరాబాదు కార్యాలయం, నగర పోలీసు శాఖలోని అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ ఫ్లోర్లు, ముఖ్య మంత్రి, చీఫ్ సెక్రటరి, డీజీపీ రూమ్‌లను, డేటా సెంటర్‌, కమాండ్‌ కంట్రోలను సీపీ పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. తెలంగాణ పోలీసులు భద్రతలో రాజీ పడకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని సీవీ ఆనంద్ తెలిపారు

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్