వీహెచ్‌పై దుర్భాషలు.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు

Siva Kodati |  
Published : Jan 29, 2022, 04:25 PM IST
వీహెచ్‌పై దుర్భాషలు.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు

సారాంశం

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుకి తెలంగాణ కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వీ హనుమంతరావు పర్యటన సందర్భంగా ఆందోళన చేసిన ప్రేమ్‌సాగర్ రావును వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని కోరింది. మంచిర్యాలలో వీహెచ్ పర్యటన సందర్భంగా ఆయనపై ప్రేమ్‌సాగర్ దుర్భాషలాడారు. దీనిపై వివరణ కోరింది పీసీసీ. 

అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు (prem sagar rao) హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌ (uttara telangana indira congress) పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రేమసాగర్ రావు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.. దీనికి సంబంధించి అనుచరులు, మద్ధతుదారులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీనే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతోందని ప్రేంసాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులను వదిలేసి ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడంపై ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రవెళ్లి సభకు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులను విస్మరించడం దారుణమన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పార్టీలో ప్రక్షాళన చేయాలన్న ప్రేంసాగర్.. కార్యకర్తల అభీష్టం మేరకు ముందుకు వెళతామన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్