మూసీకి పోటెత్తిన వరద: యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్

By narsimha lode  |  First Published Sep 6, 2023, 10:01 AM IST

 నాలుగైదు రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  మూసీ నదికి భారీగా వరద పోటెత్తింది.  దీంతో  యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.



హైదరాబాద్: నాలుగు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు  మూసీకి వరద పోటెత్తింది. దీంతో యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన నుండి వస్తున్న వరదతో  మూసీకి  వరద పోటెత్తింది.  మూసీతో పాటు దాని ఉప నదులకు  కూడ వరద పోటెత్తింది. దరిమిలా  మూసీ ఉధృతంగా  ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు గ్రామాల్లో  మూసీ వరద ప్రవాహంతో  రాకపోకలు నిలిచిపోయాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని  రుద్రవెల్లి-జూలూరు మధ్య ఉన్న బ్రిడ్జిపై నుండి మూసీ వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో  బీబీనగర్,  భూదాన్ పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం భీమలింగం వద్ద లోలెవల్ వంతెనపై మూసీ నది ప్రవహిస్తుంది. దరిమిలా సంగెం-బొల్లేపల్లి మద్య నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రవాహంతో  ఈ మార్గాల్లో  వాహనాల రాకపోకలను  అధికారులు నిలిపివేశారు. దీంతో  ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని  అధికారులు  వాహనదారులకు  సూచిస్తున్నారు.

Latest Videos

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాల్లో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.  ఇప్పటికే  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు నీటి మట్టం 643.40 అడుగులకు చేరింది. మూసీలో ప్రస్తుతం 4.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

click me!