
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఉప్పరపల్లి స్థల వ్యవహారానికి సంబంధించి నరేందర్ రెడ్డితో మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. వివరాలు.. పట్నం నరేందర్ రెడ్డితో పాటు
మిగిలిన ఇద్దరు నిందితులు వై శ్రీరాంరెడ్డి, రాకేష్‌రెడ్డిలు సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి తప్పుడు వాగ్దానాలతో భూమి కొనుగోలు ఒప్పందం చేసి మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనపై దాడికి యత్నించారని కూడా ఇంద్రపాల్ రెడ్డి ఆరోపించారు. నిందితులు 2.5 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్ 544/2023 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ నవీన్‌రెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది.