క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

Published : Mar 23, 2020, 07:52 AM ISTUpdated : Mar 23, 2020, 07:56 AM IST
క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

సారాంశం

ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. దేశ ప్రజలంతా ఆదివారం బయటకు రాకుండా జాగ్రత్త  చర్యలు తీసుకున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజు క్వారంటైన్ లో ఉంటే కరోనా అదుపులోకి వచ్చేలా లేదు. దీంతో.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.

అయితే.. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా నలుగురు హోం క్వారంటైన్ చేయలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

Also Read ఆదివారం మరో ఆరు... తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖతార్ నుంచి ఇటీవల ఇద్దరు దంపతులు మండలంలోని దాట్ల గ్రామంలో అత్తగారి ఇంటికి వచ్చారు. ఆ దంపతులు, అత్తమామలకు అధికారులు కరోనా అవగాహన కల్పించి, స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించారు. అయితే.. వారు అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం గమనార్హం.ఇంట్లో నుంచి బటయకు రావొద్దని చెప్పినా విచ్చలవిడిగా తిరిగారు. దీంతో.. పోలీసులు ఆ నలుగురిపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారంతో కలిపి ఇప్పటి వరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ మరింత  వ్యాప్తి  చెందకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    
 

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu