మంత్రి మల్లారెడ్డి ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం: పోలీసుల అరెస్ట్

Published : Aug 26, 2021, 11:14 AM ISTUpdated : Aug 26, 2021, 11:21 AM IST
మంత్రి మల్లారెడ్డి  ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం: పోలీసుల అరెస్ట్

సారాంశం

మంత్రి మల్లారెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. కోడిగుడ్లు, టమాటలతో దాడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నాడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఇంటిపై దాడికి దిగేందుకు ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.మంత్రి మల్లారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడికి యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

also read:ఛాలెంజ్‌కి కట్టుబడి ఉన్నా, తాట తీసుడే: రేవంత్‌కి మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసులతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాటలో ఓ పోలీసుకి స్వల్ప గాయాలయ్యాయి.యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉందని  భావించిన పోలీసులు మంత్రిమల్లారెడ్డి  నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి   విమర్శలకు  మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.నిన్న రాత్రి కూడ మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.  ఇవాళ కూడ కాంగ్రెస్ శ్రేణులు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే