సోషల్ మీడియాలో వేధింపులు.. యువకుడు అరెస్ట్

Published : Jun 09, 2020, 02:03 PM IST
సోషల్ మీడియాలో వేధింపులు.. యువకుడు అరెస్ట్

సారాంశం

తనకు లైంగికంగా లొంగకపోతే స్నేహితులకు పంపిస్తానని వేధింపులు గురిచేశాడు. సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 

సోషల్ మీడియా ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్న కరుడుగట్టిన సైకోను జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికి పైగా మహిళలు, యువతులతో ఫోన్ కాల్స్ మాట్లాడాడని... 30 మందికి పైగా వీడియో కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 వీడియో కాల్స్‌తో రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసి... ఆపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడి...తనకు లైంగికంగా లొంగకపోతే స్నేహితులకు పంపిస్తానని వేధింపులు గురిచేశాడు. సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 

దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలిన చందంగా సైకో వేధింపుల పర్వం ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మరికాసేపట్లో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?