ఆ కుట్ర జరిగినప్పుడు కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారా: సీఎల్పీ నేత మల్లు సెటైర్లు

By narsimha lode  |  First Published Jun 9, 2020, 1:45 PM IST

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు రాష్ట్రంలో మూడు మాసాల విద్యుత్ బిల్లులను  రద్దు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
 



హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు రాష్ట్రంలో మూడు మాసాల విద్యుత్ బిల్లులను  రద్దు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

లాక్‌డౌన్ తో పేదలు విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. విద్యుత్ బిల్లులపై వడ్డీ వసూలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  లాక్‌డౌన్ తో ఆర్ధికంగా ఇబ్బందిపడిన ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.

Latest Videos

undefined

also read:తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగించాలంటూ హైకోర్టులో పిల్, ఇంకాసేపట్లో విచారణ

కరోనా విషయంలో రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంపై మల్లు మండిపడ్డారు. ఏ రకమైన కుట్రలు జరిగాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వద్ద పెద్ద యంత్రాంగం ఉంది, అసలు ఆ కుట్రను ఎందుకు కనుక్కోలేరా అని ఆయన ప్రశ్నించారు.  ఆ కుట్రదారుడు ఎవరో చెప్పాలన్నారు. కుట్ర జరుగుతోంటే మీరు ఫామ్‌హౌస్‌లోను ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ క్షేమంగా ఉన్నారన్నారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

రైతు బంధును అందరు రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకొన్న రైతులకే రైతు బంధు పథకం వర్తింపజేయడం సరైందికాదన్నారు. 

రాష్ట్రంలోని భూములకు మీరు పట్టాదారా అని ఆయన సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు.రైతు బంధు, విద్యుత్ బిల్లుల విషయాలపై మంత్రులను కలిసేందుకుగాను ఈ నెల 11వ తేదీన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.సెక్రటేరియల్ ఎక్కడ ఉందో కూడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

click me!