ఛలో మల్లారం: ఉత్తమ్, శ్రీధర్ బాబు, భట్టి సహా పలువురి నేతల అరెస్ట్

Published : Jul 26, 2020, 02:31 PM IST
ఛలో మల్లారం: ఉత్తమ్, శ్రీధర్ బాబు, భట్టి సహా పలువురి నేతల అరెస్ట్

సారాంశం

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.   


భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 

ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతలు లేవని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మల్లారం వెళ్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు జనగామ వద్దే అరెస్ట్ చేశారు. అతనిని ఘనపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రఘునాథపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీధర్ బాబు తన ఇంటి నుండి క్యాంప్ ఆపీసుకు వెళ్లేందుకు బయలుదేరగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు కూడ చలో మల్లారం వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని కూడ పోలీసులు అడ్డుకొన్నారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.