యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన: నాన్ బెయిలబుల్ కేసులు, నలుగురి రిమాండ్

By narsimha lodeFirst Published May 31, 2023, 2:37 PM IST
Highlights


యాదాద్రి భువనగిరి కలెకర్టేట్ ముందు  ఆందోళనకు దిగిన  రైతులపై   నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది.  

భువనగిరి: యాదాద్రి కలెక్టరేట్  ముందు  ఆందోళనకు దిగిన  వారిలో  ఆరుగురిపై  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో  నలుగురిని  బుధవారంనాడు  రిమాండ్  కు పంపారు పోలీసులు.

ఆర్ఆర్ఆర్  రోడ్డు  నిర్మాణం అలైన్ మెంట్ నిర్మాణాన్ని   గతంలో మాదిరిగానే కొనసాగించాలని  రాయగిరి వాసులు డిమాండ్  చేస్తున్నారు. ఈ విషయమైమ ఆంోళనలు నిర్వహిస్తున్నారు.  ఇదే డిమాండ్  తో  నిన్న  యాదాద్రి భువనగిరి  కలెక్టరేట్ ముందు  ధర్నాకు దిగారు.  తెలంగాణ రాష్ట్ర దశాబ్ది  ఉత్సవాల  నిర్వహణ  ఏర్పాట్లపై  సమీక్షకు  మంత్రి జగదీష్ రెడ్డి  కలెక్టరేట్ కు  వచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను  రైతుల  అడ్డుకొన్నారు. కాన్వాయ్ కు అడ్డుపడిన రైతులను  పోలీసులు పక్కకు లాగివేశారు.  ఈ ఘటనను  సీరియస్ గా తీసుకుంది పోలీస్ శాఖ.

కలెక్టరేట్ ముందు  ఆందోళనకు దిగిన  రైతుల్లో ఆరుగురిపై  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు  చేసింది.  వీరిలో ఇద్దరు పారిపోయారని  పోలీసులు చెబుతున్నారు. మల్లేష్ , యాదగిరి, నిఖిల్, బాలు లను  పోలీసులు ఇవాళ  రిమాండ్  చేశారు.  రైతులపై  నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

click me!