భర్తకు విడాకులు ఇవ్వకుండా భార్య రెండో పెళ్లి

Published : Jul 09, 2019, 09:46 AM ISTUpdated : Jul 09, 2019, 09:47 AM IST
భర్తకు విడాకులు ఇవ్వకుండా భార్య రెండో పెళ్లి

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు వారి సంసారం బాగానే సాగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయంతో భర్తను దూరం పెట్టేసింది. కనీసం భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరకు కొత్త భర్తతో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. 

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు వారి సంసారం బాగానే సాగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయంతో భర్తను దూరం పెట్టేసింది. కనీసం భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరకు కొత్త భర్తతో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కె.ప్రశాంత్‌ ఐదేళ్ల క్రితం రాధిక (25)అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగం చేసేందుకు రాధిక ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. కొత్తపేట విజయపురి కాలనీలోని రాయల్‌ హాస్టల్‌లో ఉంటూ ఎల్‌బీనగర్‌లోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో ఆమె ఉద్యోగం చేస్తోంది.

 ఇటీవలికాలంలో రాధిక ప్రవర్తనపై ప్రశాంత్‌కు అనుమానం రావడంతో.. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు జూన్‌ 19న ఆమె సోదరుడితో కలిసి హాస్టల్‌ వద్దకు వెళ్లాడు. వారిని గమనించిన రాధిక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. దీంతో ప్రశాంత్‌ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య రాధిక.. శశికుమార్‌ అనే వ్యక్తితో వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. 

ఉద్యోగం చేసే సమయంలో పరియచమైన శశికుమార్‌ను రాధిక పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న తన భార్యపైన, శశికుమార్‌పైన చర్యలు చేపట్టాలని ప్రశాంత్‌ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాధికను, శశికుమార్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ