వరసలు కలుపుతూ ఇంట్లో చేరి..

By telugu news teamFirst Published Sep 5, 2020, 9:16 AM IST
Highlights

జల్సాలకు డబ్బు సరిపోక చోరీలకు పథకం వేశాడు. యూసుఫ్ గూడ, లక్ష్మీనర్సింహనగర్‌ తదితర బస్తీల్లో మహిళలతో వరస లు కలుపుతూ పరిచయాలు పెంచుకునేవాడు. వారికి చిన్న, చిన్న పనులు చేస్తూ నమ్మకం సంపాదించాడు. 

అతను ఓ దొంగ. తనకు పని కావాలంటూ.. ఇళ్లకు చేరతాడు. వరసలు కలిపి మాట్లాడతాడు. ఆ తర్వాత యోగక్షేమాలు అడుగుతూ చిన్న, చిన్న పనులు చేసి పెడతాడు. నమ్మకం కలిగిస్తాడు... అవకాశం చిక్కగానే ఇంటిని దోచేస్తాడు. వరుస గా మూడు ఇళ్లల్లో చోరీలు చేసిన మోసగాన్ని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

అతడి నుంచి 12.5 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్‌ కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి యూసుఫ్ గూడలో నివాసముంటున్నా డు.

 సినిమా షూటింగ్‌లలో దినసరి కూలీగా పనిచేసేవాడు. వచ్చిన డబ్బుతో మ ద్యం తాగి జల్సాలు చేసేవాడు. జల్సాలకు డబ్బు సరిపోక చోరీలకు పథకం వేశాడు. యూసుఫ్ గూడ, లక్ష్మీనర్సింహనగర్‌ తదితర బస్తీల్లో మహిళలతో వరస లు కలుపుతూ పరిచయాలు పెంచుకునేవాడు. వారికి చిన్న, చిన్న పనులు చేస్తూ నమ్మకం సంపాదించాడు. 

ఈ సమయంలో ఎవరెవరు ఊరెళ్తున్నారు... తాళాలు ఎక్కడ పెడతారని గమనించేవాడు. ఇలాంటి ఇళ్లల్లో చోరీలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను డీసీపీ అభినందించారు.

click me!