సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి...

By telugu news teamFirst Published Feb 22, 2020, 8:53 AM IST
Highlights

తద్వారా తమను సంప్రదించిన వారిని నమ్మించి ప్రముఖ సంస్థలో డబ్బు చెల్లించి( బ్యాక్ డోర్) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు. ఇందుకోసం విప్రో సంస్థ పేరుతో ఒక మెయిల్ ఐడీని సృష్టించి అలా నమ్మించిన వారికి ఆయా మెయిల్ ఐటీ నుంచి ఎంపిక పత్రాలను పంపించారు.

ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ కంపెనీకి నకిలీ మెయిల్ ఐడీ సృష్టించాడు. దానిని చూపించి అదే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశాడు. కాగా... నిందితుడిని బంజారా హిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గొల్కండ సమీపంలోని ఇబ్రహీం బాగ్ కు చెందిన ఫిర్దోజ్ అలియాస్ సుశాంత్(26), మణికంండకు చెందిన అనూప్, రోహిత్.. ఈ ముగ్గురూ కలిసి సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగాల పేరుతో ఆన్ లైన్ లో ప్రకటనలు చేశారు.

Also Read అక్రమ సంబంధం పేరిట వేధిస్తున్నాడని.....

తద్వారా తమను సంప్రదించిన వారిని నమ్మించి ప్రముఖ సంస్థలో డబ్బు చెల్లించి( బ్యాక్ డోర్) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు. ఇందుకోసం విప్రో సంస్థ పేరుతో ఒక మెయిల్ ఐడీని సృష్టించి అలా నమ్మించిన వారికి ఆయా మెయిల్ ఐటీ నుంచి ఎంపిక పత్రాలను పంపించారు.

ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.1.40లక్షలు తీసుకున్నారు. కర్నూలుకి చెందిన విష్ణువర్థన్ రెడ్డి, మహేంద్ర, వెంకటేశ్వర్లు, శివకుమార్ తోపాటు కరీంనగర్ కి చెందిన రాకేష్, రాహుల్ నుంచి దాదాపు రూ.8లక్షలకు పైగా వసూలు చేశారు.

అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న విష్ణువర్థన్ రెడ్డి, మహేంద్ర, వెంకటేశ్వర్లు, శివకుమార్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వచ్చి ఆరా తీశారు. దీంతో తమకు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు నకిలీవని తేలింది. దీంతో.. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. నిందితుడిని ఒకరిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. 

click me!