యువతిని నిర్భందించి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

Published : Mar 03, 2020, 08:15 AM IST
యువతిని నిర్భందించి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

సారాంశం

ఇంటికి పిలిచిన తర్వాత ఎబ్రహీంని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి బాధిత యువతి(25) ని సాబేర్, సమీనాలు మళ్లీ ఇంటికి పిలిచి ఎబ్రహీంకి అప్పగించారు. బాధితురాలిని అతను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

యువతి ని నిర్భందించి అత్యాచారానికి పాల్పడిన బహ్రెయిన్ దేశస్థుడితోపాటు అతను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బహ్రెయిన్ లోని రిప్ఫా నగరానికి చెందిన ఎబ్రహీం స్థానిక ఆస్పత్రిలో నర్సింగ్ విభాగం(మేల్ నర్స్) లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2019 అక్టోబర్ 21న నగరానికి వచ్చిన ఆయన నాంపల్లిలోని ఓ హోటల్ లో దిగాడు. పాతబస్తీ శివారు కొత్తపేట నబీల్ కాలనీకి చెందిన మహ్మద్ సాబేర్ అతని భార్య సమీనా ఇల్లు అమ్మే విషయం మాట్లాడాలంటూ బాధితురాలు, ఆమె సోదరిని ఇంటికి పిలిచారు.

Also Read పాన్ షాప్ లో మహిళ దొంగతనం.. రూ.70వేలు విలువచేసే సిగరెట్లు చోరీ...

ఇంటికి పిలిచిన తర్వాత ఎబ్రహీంని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి బాధిత యువతి(25) ని సాబేర్, సమీనాలు మళ్లీ ఇంటికి పిలిచి ఎబ్రహీంకి అప్పగించారు. బాధితురాలిని అతను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

జరిగిన విషయాన్ని బాధితురాలు తన సోదరికి చెప్పింది. దీంతో... బాధితురాలి సోదరి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన బహ్రెయిన్ దేశస్థుడు ఎబ్రహీంతోపాటు.. అతని ఇంటి యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే