24 గంటల్లో 258 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,64,164కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 22, 2021, 09:58 PM IST
24 గంటల్లో 258 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,64,164కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 249 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,908 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55,419 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 258 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 249 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,164 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,310 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 4,946 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,908కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 69, జగిత్యాల 8, జనగామ 10, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 2, కామారెడ్డి 1, కరీంనగర్ 25, ఖమ్మం 15, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 9, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 3, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 12, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 8, సిరిసిల్ల 3, రంగారెడ్డి 21, సిద్దిపేట 7, సంగారెడ్డి 2, సూర్యాపేట 5, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 12, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్