ఐటీ ఉద్యోగితో అసభ్య ప్రవర్తన... చొక్కొపట్టుకొని దులిపేసింది.

Published : Jan 04, 2020, 08:34 AM IST
ఐటీ ఉద్యోగితో అసభ్య ప్రవర్తన... చొక్కొపట్టుకొని దులిపేసింది.

సారాంశం

చొక్కా పట్టుకొని ముందుకు లాగి... నాలుగు వాయించింది. అతను... ఆమెపై దాడి చేయాలని ప్రయత్నిస్తే.. ఎదురు దాడి చేసింది. అనంతరం చుట్టుపక్కల వారిని పిలిచి... ఆకతాయతికి దేహశుద్ధి చేసింది. 

ఆమె ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె నాలుగు  నెలల గర్భిణి కూడా. రోజూ మాదిరిగానే... ఆమె నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తుండగా.. ఓ ఆకతాయి ఆమె పట్ల నీచంగా ప్రవర్తించాడు. ఆమె మెడపై చేతులు వేస్తూ... అసభ్యంగా తాకాడు. వెంటనే... ఆమె అతనిని చితకబాదింది.

చొక్కా పట్టుకొని ముందుకు లాగి... నాలుగు వాయించింది. అతను... ఆమెపై దాడి చేయాలని ప్రయత్నిస్తే.. ఎదురు దాడి చేసింది. అనంతరం చుట్టుపక్కల వారిని పిలిచి... ఆకతాయతికి దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 8గంటల సమయంలో ఆమె విధులకు వచ్చారు. అనంతరం రాత్రి  9గంటల ప్రాంతంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో.. ఇద్దరూ కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్ఆర్ చౌరస్తాకు వెళ్లారు.

భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోగా ఆమె ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ మళ్లీ ఆఫీసులోకి బయలుదేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే... ఆమె బెదిరిపోకుండా అతనికి సరైన బుద్ధి చెప్పింది. కాలర్ పట్టుకొని లాగి దులిపి వదిలిపెట్టింది. అంనతరం స్థానికుల సహాయంతో అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ