ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..

By telugu news teamFirst Published Jan 11, 2021, 9:05 AM IST
Highlights

బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చాడు. నిందితుడు బెంగళూరుకు చెందిన యువరాజ్ అలియాస్ సేవాలాల్ గా గుర్తించారు.

నిరుద్యోగులే అతని టార్గెట్. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిందరి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత వారి వీక్ నెస్ పై దృష్టిపెడతాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని.. ప్రభుత్వంలో పనులు చేయిస్తానని నమ్మిస్తాడు. అందుకోసం వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతాడు. కాగా.. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చాడు. నిందితుడు బెంగళూరుకు చెందిన యువరాజ్ అలియాస్ సేవాలాల్ గా గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు కేఎస్‌ ఆర్టీసీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానంటూ నమ్మించి కోటి రూపాయలను వసూలు చేశాడు. ఎన్నిరోజులైన పదవీ లేదు, డబ్బులు వాపస్‌ ఇవ్వకుపోవటంతో బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత బాధితులు ఒక్కొక్కరే బయటకు రావడంతో యువరాజ్‌ బాగోతం రచ్చకెక్కింది.

తన దందాలో విశ్రాంత ఎస్పీ పాపయ్యను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న మహిళకు గవర్నర్‌ పదవిని చేతిలో పెడతానని కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం. పదవి రాకపోవడంతో ఆ మహిళ విల్సన్‌ గార్డెన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో యువరాజ్, పాపయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాపయ్య పరారీలో ఉన్నాడు.   రాష్ట్రానికి చెందిన బలమైన బీజేపీ నాయకునితో కలిసి యడియూరప్పను సీఎం పదవి నుండి దించటానికి సైతం యువరాజ్‌ పథకం వేసినట్లు తెలిసింది. మోసం చేసి సంపాదించిన డబ్బులను నటి రాధికా కుమారస్వామితో పాటు ఇతరుల అకౌంట్‌కు బదిలీ చేసినట్లు సీసీబీ అధికారులు చెబుతున్నారు.

click me!