తిట్టాడనే కోపంతో... మర్మాంగం కోసేసి..!

Published : Jun 24, 2021, 07:38 AM IST
తిట్టాడనే కోపంతో... మర్మాంగం కోసేసి..!

సారాంశం

 చిల్లర సామాగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ కి చెందిన రుద్రారపు కార్తీక్... కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు.

తనను దూషించాడనే కోపంతో ఓ వ్యక్తి... తన మర్మాంగాన్ని, చెవిని కత్తితో  కోసేవాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోపుడు బండిపై  చిల్లర సామాగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ కి చెందిన రుద్రారపు కార్తీక్... కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు. స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో తాత్కాలికంగా నివసిస్తున్నాడు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం అర్థరాత్రి మద్యం సేవించి.. ఆ మత్తులో కార్తీక్ ను దుర్భాషలాడాడు. దీంతో.. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్... హుస్సేన్ పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు.

ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే