తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు: కొత్తగా 1,114 మందికి కరోనా పాజిటివ్

Siva Kodati |  
Published : Jun 23, 2021, 09:05 PM IST
తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు: కొత్తగా 1,114 మందికి కరోనా పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 కరోనా కేసులు నమోద్వగా, 12 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 కరోనా కేసులు నమోద్వగా, 12 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది. అటు మరణాల సంఖ్య 3,598కి చేరింది.  నిన్న ఒక్క రోజే 1280 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 5,96,628 మంది కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.3 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 0.58 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉనట్లు తెలిపింది.. జాతీయ స్థాయిలో ఇది 96.52 శాతంగా ఉండగా, తెలంగాణలో 96.74 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,462 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 1,18,109 మంది శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వివరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 129 కేసులు వెలుగుచూడగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 59, జీహెచ్ఎంసీ 129, జగిత్యాల 23, జనగామ 11, జయశంకర్ భూపాలపల్లి 21, గద్వాల 7, కామారెడ్డి 3, కరీంనగర్ 69, ఖమ్మం 69, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 23, మహబూబాబాద్ 44, మంచిర్యాల 49, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 58, ములుగు 24, నాగర్ కర్నూల్ 12, నల్గగొండ 72, నారాయణపేట 6, నిర్మల్ 3, నిజామాబాద్ 8, పెద్దపల్లి 53, సిరిసిల్ల 16, రంగారెడ్డి 75, సిద్దిపేట 44, సంగారెడ్డి 16, సూర్యాపేట 69, వికారాబాద్ 14, వనపర్తి 17, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 53, యాదాద్రి భువనగిరిలో 35 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu