దూషించాడని, కత్తితో మర్మాంగాన్ని కోసి, డయల్ 100కు ఫోన్ చేసి...

Published : Jun 24, 2021, 07:07 AM IST
దూషించాడని, కత్తితో మర్మాంగాన్ని కోసి, డయల్ 100కు ఫోన్ చేసి...

సారాంశం

ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల అత్యంత దిగ్భ్రాంతికరమైన రీతిలో వ్యవహరించాడు. తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి మరో వ్యక్తి చెవిని, మర్మాంగాన్ని కోసేసి, పోలీసులకు విషయం చెప్పాడు.

కొత్తగూడెం: తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘఠన జరిగింది. తనను తిట్టాడనే కోపంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అతని చెవిని, మర్మాంగాన్ని కోసేశాడు. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 

తోపుడుబండిపై హైదరాబాదులో చిల్లర సామగ్రి అమ్ముకునే రుద్రంరపు కార్తిక్ కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి ఐదు రోజల క్రితం వలస వచ్చాడు. అక్కడ శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం అర్థరాత్రి మద్యం మత్తులో కార్కిక్ ను తిట్టాడు దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దాంతో విపరీతమైన కోపంలో కార్తిక్ హుస్సేన్ పాషా చెవిని, మర్మాంగాన్ని కత్తితో కోశాడు. 

ఆ తర్వాత డయల్ -100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. భాధితుడిని ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు