ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. సీఎం కేసీఆర్ పేరు చెప్పి..!

By telugu news teamFirst Published Jun 22, 2021, 9:36 AM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు గుంజాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. 

తనకు రాజకీయనాయకులతో పరిచయాలు ఉన్నాయని.. సీఎం కేసీఆర్ కి తాను కార్యదర్శినంటూ నమ్మించి.. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించగలనని చాలా మంది అమాయకులను మోసం చేశాడు. వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు గుంజాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్‌కు చెందిన కమల్ కృష్ణా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడు సీఎం కేసీఆర్‌ పేరు చెప్పుకుని డబ్బులు వసూల్‌ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా తాను పని చేస్తున్నట్లు.. బీసీ కార్పొరేషన్‌లో మీకు పదవి ఇప్పిస్తా అని ఆశచూపి నాయకుల నుంచి డబ్బులు రాబట్టారు. 

వివిధ పార్టీలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. సీఎం పేషీలో కార్యదర్శినని నమ్మించి డబ్బులు తీసుకుంటాడు. అనంతరం మొబైల్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. ఈ విధంగా అతడి బారిన చాలామంది నాయకులు మోసపోయారని సమాచారం. చివరకు సోమవారం నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

click me!