అధిక వడ్డీ పేరిట ముఠా చీటింగ్.. రట్టుచేసిన పోలీసులు

By telugu news teamFirst Published Feb 8, 2021, 2:40 PM IST
Highlights

నిందితుల దగ్గర నుంచి 4 లాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్. రూ.3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సీసీసీవో లింక్ పేరుతో సోషల్ సైట్‌లో వైరల్ చేశారని చెప్పారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

అధిక వడ్డీ ఇస్తామంటూ నమ్మించి సామాన్యులను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి 4 లాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్. రూ.3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సీసీసీవో లింక్ పేరుతో సోషల్ సైట్‌లో వైరల్ చేశారని చెప్పారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

చైనాకు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. రాయదుర్గం పీఎస్‌లో వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీపీ వెల్లడించారు. 2 ఫేక్  కంపెనీలు సృష్టించి, ఓ మొబైల్ అప్లికేషన్ ద్వారా మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

 షేరింగ్ ఎకానమీ పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. 90 రోజుల్లో మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ముకు 12 శాతం వడ్డీ ఇస్తామని డిపాజిట్లు రాబట్టారని తెలిపారు. బెంగళూరు, కాన్పూర్, హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితులు ఉదయ్‌ప్రతాప్, నితీష్‌కుమార్ కొఠారి, రాజేష్‌శర్మను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.
 

click me!