నన్ను అమ్మవారు ఆవహించిందంటూ దొంగ బాబా బురిడీ.. రూ.200కోట్లు స్వాహా

By telugu teamFirst Published Dec 20, 2019, 8:26 AM IST
Highlights

ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతానంటూ...మాయ చేసి.. ఆ తర్వాత తన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండండూ భక్తులకు మాయమాటలు చెప్పి రూ.కోట్లు కూడపెట్టాడు. గత డిసెంబరులో అరెస్టుకు ముందు ఒక్క ఏడాదిలో రూ.60కోట్లు దోచుకున్న బురిడీ బాబా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.40కోట్లు కొల్లగొట్టాడు 

చక్కగా షర్ట్ ప్యాంట్ వేసుకొని.. లగ్జరీ కారు పక్కన చక్కగా ఫోటోకి ఫోజు ఇచ్చిన ఈ యువకుడిని చూస్తే ఎవరైనా ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీరో, లేదా ఏ బిజినెస్ మెన్ అనుకుంటారు. అయితే... అతను ఓ బాబా. ప్రజలకు మాయ మాటలు చెప్పి.. కోట్లు కూడబెట్టుకుంటున్న దొంగ బాబా అని ఎవరూ అనుకోరు. 

ఆ మధ్యకాలంలో.., ఓ వ్యక్తి తాను బాబా అంటూ చెప్పుకు తిరిగాడు.. మీకు గుర్తుండే ఉంటుంది. అతను చేస్తున్న మోసాలు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు కూడా చేశారు. అయితే.... ఇటీవల అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. జైల్లో చిప్పకూడు తిన్న తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదు. తనను అమ్మవారు ఆహ్వానించిదంటూ తాను ఏది చెబితే అది జరుగుతుందంటూ కొత్త మోసాలకు తెరలేపాడు.

అంతేకాకుండా ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతానంటూ...మాయ చేసి.. ఆ తర్వాత తన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండండూ భక్తులకు మాయమాటలు చెప్పి రూ.కోట్లు కూడపెట్టాడు. గత డిసెంబరులో అరెస్టుకు ముందు ఒక్క ఏడాదిలో రూ.60కోట్లు దోచుకున్న బురిడీ బాబా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.40కోట్లు కొల్లగొట్టాడు ఈ రకంగా రెండేళ్లలోనే భక్తుల నుంచి రూ.100కోట్లు స్వాహా చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గిరీశ్‌ కుమార్‌ (34) చేస్తున్న మాయ ఇది. మరోసారి ఇతనిని పోలీసులు అరెస్టు చేశారు. 

2012లో మాదాపూర్‌లో ఏఎ్‌సఆర్‌సీ కేంద్రాన్ని స్థాపించాడు. అక్కడ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాల క్లాసులు చెప్పేవాడు. ఒక్కో క్లాస్‌కు వారి స్థాయిని బట్టి రూ. 10వేల నుంచి రూ. 2లక్షల దాకా వసూలు చేసేవాడు. తర్వాత భక్తుల సమస్యలను బట్టి వివిధ రకాల ఆధ్యాత్మిక తరగతులను కుబేర ప్రియ, అమృత ప్రక్రియ, కల్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియగా విభజించాడు. వాటికిలక్షల్లో ఫీజు వసూలు చేసేవాడు. 

2024లో దేశానికి తానే ప్రధానినవుతానని డబ్బా కొట్టుకునేవాడు. కొన్నాళ్లకు 30 స్టార్ట్‌పలను ప్రారంభించానని.. అందులో రూ.1100 నుంచి రూ.66వేల దాకా పెట్టుబడి పెట్టొచ్చని.. ఒకరు, నలుగురిని.. ఆ నలుగురు మరో నలుగురి చొప్పున చేర్చుకుంటూ వెళితే కోట్లలో కమిషన్‌ వస్తుందని నమ్మించాడు. భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. కొందరైతే రూ.2కోట్ల నుంచి రూ.4కోట్లదాకా పెట్టుబడి పెట్టారు. ఇలా గత ఏడాది భక్తుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే రూ. 60 కోట్లు కొల్లగొట్టాడు. ఆ డబ్బునంతా 16 బ్యాంకుల్లో జమచేశాడు.

గత ఏడాది పోలీసులకు దొరికిపోయినా... తన డబ్బు, పరపతితో.. ఇట్టే బయటకు వచ్చాడు. మళ్లీ తాజాగా మోసాలు మొదలుపెట్టాడు. అతను తిరిగే కార్లన్నీ లగ్జరీకార్లే. వాటి విలు కూడా రూ.కోటికి దగ్గర్లోనే ఉంటుంది. 

click me!