బంగారం దొంగగా మారిన.. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్

By ramya NFirst Published Mar 21, 2019, 11:46 AM IST
Highlights

ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యిండి.. దొంగగా మారాడు. వ్యసనాలకు బానిసగా మారి.. చేతిలో సంపాదన లేక.. బంగారం చోరీ ని వృత్తిగా మార్చుకున్నాడు. 

ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యిండి.. దొంగగా మారాడు. వ్యసనాలకు బానిసగా మారి.. చేతిలో సంపాదన లేక.. బంగారం చోరీ ని వృత్తిగా మార్చుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారం దోచుకున్నాడు. ఆ బంగారం మొత్తాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టి వచ్చిన డబ్బుతో లగ్జరీ జీవితం గడుపుతున్నాడు.

గత 13 సంవత్సరాలుగా అతను ఇదే వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాడు. కాగా.. దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఆ వ్యక్తిని తాజాగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 800గ్రాముల బంగారం, రూ.1.50లక్షల నగదు తోపాటు రూ.30లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ప్రకాశంజిల్లాకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. ఇతను 2004లో ఎంబీఏ పూర్తి చేసి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. తర్వాత జల్సాలకు అలవాటుపడిన వంశీకృష్ణ దొంగగా మారాడు. హైదరాబాద్‌కు మకాం మార్చి దొంగతనాలు చేశాడు. వంశీకృష్ణ ప్రవర్తనతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 2006 నుంచి పలుమార్లు పోలీసులకు చిక్కినా దొంగతనాలు మానలేదు. కమిషనరేట్‌ పరిధిలో వరుస దొంగతనాలపై నిఘా పెంచిన పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

click me!