
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న భట్టి విక్రమార్కను భూపాలపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముంపు బాధితుల పరామర్శకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.