ఈ నెల 21న మునుగోడులో అమిత్ షా సభ.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు: తరుణ్ చుగ్

By Sumanth KanukulaFirst Published Aug 17, 2022, 12:54 PM IST
Highlights

మునుగోడులో ఈ నెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ చెప్పారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభవుతుందని తెలిపారు. 

మునుగోడులో ఈ నెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ చెప్పారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభవుతుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు సభలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాడాలనేది పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని అన్నారు. అదే సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు సభలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుందని ఆరోపించారు.

గత రెండు రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర సజావుగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అవినీతి, కుటుంబ పాలనే రాజకీయాలే శత్రువులని అన్నారు. కేసీఆర్‌కు అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణ బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీకే ప్రజల మద్దతు ఉందని అన్నారు.

click me!