ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు దాఖలు

By telugu teamFirst Published Nov 22, 2021, 6:52 PM IST
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన తరఫున మరో రెండు సెట్ల నామినేషన్లూ దాఖలయ్యాయి. ఈ నామినేషన్ల దాఖలుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు సహా పలువురు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో ఉన్నారు.
 

హైదరాబాద్: ఉమ్మడి Warangal జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా Pochampalli Srinivas Reddy నామినేషన్లు(Nominations) దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్‌లో ఆయన నామినేషన్ వేశారు. ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామినేషన్ పత్రాలు అందించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా.. ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు File చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి ఒక సెంట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఒక సెట్ నామినేషన్లు వేశారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్‌పర్సన్ గండ్ర జ్యోతిలు ఒక సెట్ నామినేషన్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫున దాఖలు చేశారు. కాగా, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌లు పోచంపల్లి తరఫున మరో సెట్ నామినేషన్ వేశారు.

ఈ నామినేషన్ల దాఖలు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు మాట్లాడారు. వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం అని అన్నారు. రైతు బంధువు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్‌కు మెండుగా ఉన్నాయని తెలిపారు. నిన్న మొన్నటి వరకు సాగు చట్టాలు చాలా మంచివని, రైతులకు ప్రయోజనాలు ఇస్తాయని పలికిన బండి సంజయ్, బీజేపీ నేతలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలనుకుంటే కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు.

Also Read: కేసీఆర్ సంచలన నిర్ణయం: ఏడుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..?
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, టీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అండదండలు, మంత్రుల ఆశీర్వాదాలు ఉన్నాయని, ఓటర్ల ఆదరణతో మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతాననే నమ్మకం ఉన్నదని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థనిక సంస్థల తరఫున టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డే ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 4వ తేదీతో ఆయన పదవి కాలం ముగియనుంది. 

Also Read: Telangana MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి సహా పలువురు నామినేషన్లు పత్రాలు చూపించి దాఖలు చేయడానికి వెళ్లారు.

click me!