శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

By Siva KodatiFirst Published Aug 21, 2020, 7:46 PM IST
Highlights

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్న ఇద్దరు నేతలు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వేర్వేరుగా ట్వీట్లు చేశారు. కాగా రాష్ట్రపతి తన సంతాప సందేశాన్ని తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వారిని కాపాడలేకపోయారు.

 

Fire at the Srisailam hydroelectric plant is deeply unfortunate. My thoughts are with the bereaved families. I hope those injured recover at the earliest.

— Narendra Modi (@narendramodi)

 

కాగా ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో లోపల 17 మంది చిక్కుకున్నారు.

ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే విధుల్లో చేరారు. మరో అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్ తన సహోద్యోగులను కాపాడే ప్రయత్నం చేశారు. ఐదు నిమిషాల్లో తాను మరణిస్తున్నానని, తన వద్దకు ఎవరూ రావద్దని ఆయన మోహన్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది. 
 

తెలంగాణలోని శ్రీశైలం జల విద్యుత్తు ప్లాంటు లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

— President of India (@rashtrapatibhvn)
click me!