జీహెచ్ఎంసీ ఎన్నికలు : మోడీ హైదరాబాద్ టూర్.. మతలబేంటి..?

By AN TeluguFirst Published Nov 27, 2020, 10:47 AM IST
Highlights

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ప్రచార సమయం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో శనివారం కీలకమైన రోజు కాబోతోంది. 

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ప్రచార సమయం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో శనివారం కీలకమైన రోజు కాబోతోంది. 

ఆదివారం ప్రచారం చివరిరోజు కావడంతో  ముందురోజే అగ్రనేతల కార్యక్రమాలు ప్లాన్‌ చేశాయి అన్ని పార్టీలు. ఇందులో భాగంగానే రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుండగా... అదే టైమ్‌లో హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటనకు వస్తుండటం... ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటలా 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి.. 4.10 గంటలకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు గడిపే మోడీ... కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. 

కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోడీకి నేరుగా సంబంధం లేకపోయినా... హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్‌ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోడీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. 

కేసీఆర్‌ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గానే ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్‌ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా.. ఇప్పుడు ప్రధాని పర్యటన ఆసక్తిగా మారింది. 

click me!