తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 761 కేసులు

By telugu news teamFirst Published Nov 27, 2020, 9:27 AM IST
Highlights

కరోనా మహమ్మారి కారణంగా శుక్రవారం ఒక్కరోజే  నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,448కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 702 మంది కోలుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి  విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,242 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 761 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

కాగా..  కరోనా మహమ్మారి కారణంగా శుక్రవారం ఒక్కరోజే  నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,448కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 702 మంది కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,55,378కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. వారిలో 8,651 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 53,32,150కి చేరింది. కరోనా టెస్ట్ కి ఇచ్చి.. రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 631గా ఉంది. 

click me!